KMR: ఆర్టీసీ డిపో మేనేజర్‌గా నూతనంగా నియమితులైన దినేష్ గురువారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ నూతన డీఎంకు పలు సూచనలు చేశారు. ఆర్టీసీ బస్సులను ఖచ్చితమైన సమయ పాలనతో, ప్రణాళికాబద్ధంగా నడపాలన్నారు. ప్రయాణికులను నిర్ణీత సమయానికి వారి గమ్య స్థానాలకు చేర్చడంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.