MBNR: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన జడ్చర్ల మండలంలోని గంగాపూర్ దేవాలయాన్ని పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పీజీ కళాశాల ప్రిన్సిపల్ చంద్ర కిరణ్ మాట్లాడుతూ.. గంగాపురం లక్ష్మీ చెన్నకేశవ దేవాలయాన్ని చోళులు నిర్మించారని, అక్కడ శాసనాలు, దేవాలయ ప్రాకారాలకు సంబంధించిన వివరాలు విద్యార్థులకు వివరించేందుకు తీసుకొచ్చామన్నారు.