PDPL: సామాజిక ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 5న నిర్వహించనున్న ”అలాయ్.. బలాయ్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వేదిక కన్వీనర్ క్యాతం వెంకట రమణ పిలుపునిచ్చారు. గోదావరిఖనిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వివిధ సామాజికవర్గాలను ఒకే తాటిపైకి తీసుకురావడం ప్రధాన ఉద్దేశ్యంగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.