BHNG: వలిగొండలోని ప్రధాన రహదారిపై గత కొన్ని నెలలుగా కృష్ణా నీరు వృథాగా పోతోంది. బీసీ కాలనీకి వెళ్లే దారిలో పైపులైన్ లీకేజీ వల్ల నీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో పెద్ద గుంట ఏర్పడింది. దీనివల్ల వాహనదారులు, కాలినడకన వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి పైపులైన్ మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.