KMM: దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం క్వింటాకు ₹500 బోనస్ ఇస్తున్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆనంద్ బాబు అన్నారు. శుక్రవారం సత్తుపల్లి (మం) కిష్టారంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కాంగ్రెస్ నేత దయానంద్‌తో కలిసి మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.