MHBD: కురవి మండలకేంద్రంలోని శ్రీభద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆలయంలో నేడు ఆలయ అర్చకులు లక్ష బిల్వార్చన పూజ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం చివరి శుక్రవారం కావడంతో భారీగా తరలివచ్చిన భక్తుల ఆధ్వర్యంలో వీరభద్రుడిని ప్రత్యేకంగా అలంకరించారు. ప్రభుత్వ విప్ రామచందర్ నాయక్ వీరభద్రుడిని దర్శించుకుని పూజలు చేశారు.