TG: బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, ఈశాన్య గాలుల ప్రభావంతో వర్షాలు పడతాయని తెలిపింది. ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రెండు రోజుల పాటు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.