W.G: తణుకు పట్టణంలో గురువారం భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శతవార్షికోత్సవం పార్టీ శ్రేణుల మధ్య ఘనంగా జరిగింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ స్వేచ్చ, స్వాతంత్రం కోసం మహోజ్వల పోరాటాల కేతనంగా, కార్మిక వర్గ సైద్ధాంతిక శక్తిగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిందని సీపీఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు అన్నారు.