ఎన్టీఆర్: పటమటలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో ఈనెల 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉచిత దత్త క్రియా యోగ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు దత్త క్రియా యోగ సమన్వయకర్త తిరుపతిరాజు తెలిపారు. ఉదయం 6 గంటలకు తరగతులు ప్రారంభమవుతాయన్నారు. 12 ఏళ్లు పైబడిన వారంతా శిక్షణలో పాల్గొనవచ్చన్నారు. వివరాలకు 9866041332 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.