KDP: మండల కేంద్రమైన సింహాద్రిపురం ఎంపీడీఓ కార్యాలయ సభ భవనంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో కృష్ణమూర్తి తెలిపారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆయన తెలుపుతూ.. ఈ సమావేశంలో ప్రజలకు సంబంధించిన సమస్యలతోపాటు పథకాల అమలు గురించి చర్చిస్తామన్నారు. కావున ఈ సమావేశానికి మండల స్థాయి అధికారులు హాజరు కావాలన్నారు.