MDK: భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన అత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. భారతదేశం ఆర్థికవేత్త, నిరాడంబరి ఒక గొప్ప మహోన్నత వ్యక్తిని కొల్పొయం అన్నారు.