CTR: పుంగనూరు మండలంలో ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. నల్లగుట్టపల్లి తాండ, పట్రపల్లి తాండ పరిసరాల్లో నిర్వహించిన దాడులో నాటు సారా తయారీకి ఉపయోగించే 1,000 లీటర్ల బెల్లం ఊట ద్వంసంచేసి, 20 లీటర్ల సారాను సీజ్ చేశారు. పెద్ద తాండకు చెందిన బాబు నాయక్, పట్రపల్లి తాండకు చెందిన మునెమ్మలని అరెస్ట్ చేసినట్లు సీఐ సురేశ్ రెడ్డి తెలిపారు.