NLR: పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని డ్వామా పీడీ గంగా భవాని హెచ్చరించారు. మనుబోలు మండలంలోని చెరుకుమూడి గ్రామంలో నిర్మాణంలో ఉన్న మినీ గోకులాన్ని, కొమ్మలపూడి గ్రామంలో పూర్తయిన సీసీ రోడ్ను శుక్రవారం ఆమె ఆకస్మిక తనీఖీ చేశారు. నాణ్యతను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో డిసెంబర్ నాటికల్లా 1,125 మినీ గోకులాలను రూ. 80 కోట్లతో పూర్తి చేస్తామన్నారు.