GNTR: అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎంపీపీ షేక్ నర్గీస్ అన్నారు. శనివారం ఫిరంగిపురం మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంపీడీవో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శులు, మండల అన్ని శాఖల అధికారులు సమావేశానికి తప్పకుండా హాజరవ్వాలన్నారు.