KKD: ఏలేశ్వరంలోని గత కొన్ని రోజులుగా చేస్తున్న జీడి పిక్కల కార్మికుల ధర్నా శనివారం 42వ రోజుకి చేరుకుంది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శేషు బాబ్జి మాట్లాడుతూ.. యాజమాన్యం కార్మికులకు న్యాయం చెయ్యకపోతే ప్రభుత్వం చూస్తూ ఉండటం సరికాదని, స్థానిక ఎమ్మెల్యే స్పందించి వెంటనే కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.