PLD: నూజెండ్ల మండలం పెద్దవరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రతన్ టాటా జయంతి కార్యక్రమం ఏర్పాటు చేశారు. హెచ్ఎం నాగేశ్వరరావు మాట్లాడుతూ 2024లో భారత్ కోల్పోయిన ఒక రత్నం రతన్ టాటా అని అన్నారు. రతన్ టాటా క్రమశిక్షణ పాటించిన విలువలు విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి అని తెలిపారు. రతన్ టాటా చిత్రపటానికి పూలమాలవేసి నివాళి తెలిపారు.