కొరడాతో కొట్టుకోవడం, చెప్పులు వేసుకోనని చెప్పడం లాంటి రాజకీయ జిమ్మిక్కులకు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై పాల్పడుతున్నారని డీఎంకే ప్రిసీడియం చైర్మెన్ ఆర్ఎస్ భారతి ఆరోపించారు. అన్నా వర్శిటీలో జరిగిన అత్యాచారంపై విద్యార్థిని ఫిర్యాదు చేసిన గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. నిందితుడికి డీఎంకేకు ఎలాంటి సంబంధం లేదన్నారు.