GNTR: పెదనందిపాడు ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో శనివారం ఎస్ఎఫ్ఐ నూతన కమిటీని 11 మందితో ఎన్నుకున్నారు. SFI జిల్లా కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ.. పొన్నూరు టౌన్ ఎస్ఎఫ్ఐ కమిటీలో అధ్యక్ష కార్యదర్శులుగా ఈశ్వర్, అభిలాష్ ఉపాధ్యక్షులు అభి, యశ్వంత్ సహాయ కార్యదర్శులు భాగ్యరాజు, శ్యామ్ ను ఎన్నుకున్నట్లు తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కరానికి ఈ కమిటీ పని చేస్తుందన్నారు.