కృష్ణా: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సహకారంతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నట్లు ఎంపీటీసీ మేకా సత్యనారాయణ ప్రసాద్ (బంగారుబాబు) తెలిపారు. గురువారం చల్లపల్లి మండలం పాగోలు ఎస్సీ కాలనీలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.ఆరు లక్షలతో నూతన సీసీ రోడ్డు నిర్మించారు. ఈ నిర్మాణ పనులను ఎంపీటీసీ బంగారుబాబు ప్రారంభించి పరిశీలించారు.