ASR: కూనవరం మండలం పల్లూరు పెస గ్రామ కమిటీ ఎన్నిక గురువారం ఏకగ్రీవంగా జరిగింది. గ్రామసభ ఏర్పాటు చేసిన అధికారులు ఎన్నికలు నిర్వహించగా ఉపాధ్యక్షుడిగా మడెం బాబురావు, కార్యదర్శిగా మడెం విజయ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు గ్రామ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించి ధ్రువ పత్రాలను ఇరువురికి అందజేశారు.