ASR: రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి ఆమె భర్త భాస్కర్ పై మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత బాబు చేసిన ఆరోపణలు సరికాదని రాజవొమ్మంగి టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు గొల్లపూడి పెద్దిరాజు గురువారం అన్నారు. ఎమ్మెల్యే గడిచిన 6మాసాల్లోనే రాజవొమ్మంగి మండలంలో లోదొడ్డి, కిండంగి, కిమ్మాలగెడ్డ, అమ్మిరేకుల మీదుగా మూర్లవారి వీధికి బీటీ రోడ్లు మంజూరు చేయించారన్నారు.