SKLM: జిల్లాలో ఉన్న దివ్యాంగులకు పెట్రోల్ సబ్సిడీ కోసం ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సహాయ డైరెక్టర్ కె కవిత గురువారం తెలిపారు. సొంతంగా మూడు చక్రాల వాహనం కలిగిన దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తులను శ్రీకాకుళంలో తమ కార్యాలయానికి అందజేయాలని తెలిపారు. పూర్తి వివరాల కోసం తమ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆమె తెలిపారు.