ADB: ఆదిలాబాద్ జిల్లాలో మైనర్ డ్రైవింగ్‌పై ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం పలువురు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్ డ్రైవింగ్ నేరమని, ఇకపై కేసులు నమోదు చేస్తామని, వాహన యజమానులు, తల్లిదండ్రులు కూడా భాగస్వాములవుతారని తెలిపారు. ప్రమాదాలు జరిగితే ఇన్సూరెన్స్ రాదని, 18 ఏళ్లు నిండిన వారికి లైసెన్సులు తీసుకోడానికి సహాయం చేస్తామని చెప్పారు.