WGL: జిల్లా పురావస్తు పరిశోధనశాలను ఎంపీ కడియం కావ్య గురువారం సందర్శించారు. పరిశోధనశాలలో ఉన్న శిలాశాసనాలు, విగ్రహాలు, శిల్పకళా సంపదను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంలో ఆమె మాట్లాడుతూ.. కాకతీయుల సంస్కృతి తెలంగాణ గర్వకారణమని, ఈ వారసత్వాన్ని కాపాడడం మన అందరి బాధ్యతగా భావించాలన్నారు. పురావస్తు శాఖ చర్యలను అభినందిస్తూ, సంరక్షణా పనులు మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.