NLG: వేములపల్లి మండలంలోని మొల్కపట్నం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్‌కు సోమవారం గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. లబ్ధిదారుల ఎంపికలో అన్యాయం జరిగిందని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు కాకుండా అనర్హులైన వారిని ఎంపిక చేశారని తెలిపారు. 15 రోజుల్లో అధికారులతో విచారణ చేయించి న్యాయం చేస్తామని కలెక్టర్ అన్నారు.