వరంగల్: వర్ధన్నపేట పట్టణ పరిధిలోని డీసీ తండాలో స్థానిక ఎమ్మెల్యే నాగరాజు చిత్రపటానికి శుక్రవారం నాయకులు ఆంగోతు లచ్చిరాం, కీమా నాయక్, తారాబాయి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ నెల 17న అసెంబ్లీలో స్థానిక మున్సిపాలిటీ పరిధి నుంచి డీసీ తండాతోపాటు ఏడు తండాలను తొలగించి వాటిని పంచాయతీలుగా గుర్తించాలని ఎమ్మెల్యే నాగరాజు కోరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.