ADB: జిల్లా కేంద్రంలోని తిరుపల్లి సమీపంలో ఆగిపోయిన పాత జాతీయ రహదారి నిర్మాణానికి సహకరించాలని ఎమ్మెల్యే శంకర్ కోరారు. శుక్రవారం రహదారి నిర్మాణంతో ఇళ్లను కోల్పోతున్న వారితో ఆయన మాట్లాడారు. రోడ్డు నిర్మాణంతో పట్టణ అభివృద్ధితో పాటు ప్రయాణికులకు మేలు జరుగుతుందన్నారు. ఇళ్ల యజమానులు ముందుకు వస్తే రావలసిన నష్టపరిహారం వచ్చేలా కృషి చేస్తానన్నారు.