MBNR: రాష్ట్ర ఆర్థిక, గణాంక శాఖ డైరెక్టరేట్ ఆదేశానుసారంగా 7వ చిన్న నీటి పారుదల గణన, రెండవ నీటి వనరుల గణన 2023 – 24 సంవత్సరానికి జిల్లా స్థాయి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు. ఇవాళ జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో ప్రజావాణి అనంతరం జిల్లా స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.