ప్రగతి భవన్లో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. దసరా పండగా సందర్భంగా మొదట ప్రగతి భవన్ లోని నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయాన్ని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయంలో పూజలు చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య కేసీఆర్ పలు పూజలు చేపట్టారు. సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ, కుమారుడు కేటీఆర్, కోడలు శైలిమ, మనవడు హిమాన్షు ఈ పూజలో పాల్గొన్నారు.
కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేస్తున్న సీఎం కేసీఆర్:
ప్రగతి భవన్లో కుటుంబంతో కలిసి నల్ల పోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం కేసీఆర్
శమీ పూజ, వాహన పూజ, ఆయుధ పూజ,ఆశీర్వచనం కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్
రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించేలా ఆశీర్వదించాలని, విజయాలు సిద్ధించాలని… pic.twitter.com/W6ZIGdi0ff
పూజలో భాగంగా సీఎం కేసీఆర్ జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాలపిట్టను సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ ఆయుధ పూజను చేశారు. పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత ప్రగతి భవన్ అధికారులు, సిబ్బందితో కేసీఆర్ ముచ్చటించారు. ఈ సందర్భంగా అందరికీ సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లుగా సీఎం కేసీఆర్ తెలిపారు.