»Do You Know About Zero Shadow Today Your Shadow Disappeared In Hyderabad
Zero Shadow: జీరో షాడో గురించి తెలుసా.. హైదరాబాద్లో ఈ రోజు మీ నీడ మాయం
ఎండ మనమీద పడినప్పుడు కచ్చితంగా నీడ ఏర్పడుతుంది. కానీ కొన్ని ప్రత్యేక రోజుల్లో ఎండపడినా సరే వస్సువుల నీడ కనిపించదు. ఇది సంవత్సరంలో రెండు సార్లు వస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ ప్రాంతంలోని వారు ఈ దృశ్యాన్ని చూడొచ్చు.
Do you know about Zero Shadow.. Today your shadow disappeared in Hyderabad
Zero Shadow: వస్తువ మీద కానీ, మనిషిమీద కానీ ఎండ పడినప్పుడు పక్కనే దాని తాలుకు ప్రతిరూపం ఛాయ రూపంలో కన్పిస్తుంది. అలాగే వస్తువుతో పాటే నీడ కదులుతుంది. కానీ అలా కాకుండా ఎండ పడినా కూడా నీడ ఏర్పడదు. దాన్ని జీవో షాడో డేగా అభివర్ణిస్తారు. అలాంటి దృశ్యాన్నే ఈ రోజు హైదరాబాద్ వాసులు చూడబోతున్నారు. ఈ శూన్యదినాన్ని చూడాలంటే హైదరాబాద్లో మధ్యాహ్నం 12:12 గంటలకు మొదలౌతుంది. ఇది ఎక్కువ సమయం ఉండదు. కేవలం రెండు, మూడు నిమిషాలు మాత్రమే ఉంటుంది. అలాగే ఇదే రోజు బెంగళూరులో సైతం ఏర్పడుతుంది. అక్కడ 12:17 గంటల నుంచి 12:23 గంటల వరకు ఈ వింత కన్పిస్తుంది.
మిట్టమధ్యాహ్నం సూర్యకిరణాలు కర్కట రేఖ (ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్), మకర రేఖ (ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్) మధ్య ఉండే ప్రాంతాల్లో ఏటా రెండుసార్లు ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అరుదైన సందర్బాన్ని భద్రపరుచుకోవడానికి birlasc@gmail.com ఈ సమయంలో తీసుకున్న ఫోటోలను పంపించాలని హైదరాబాద్లోని బీఎం బిర్లా ప్లానిటోరియం ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే ఎండ ఉన్నప్పుడే ఇది సాధ్యం అవుతుంది. ఇది రెండు మూడు రోజుల పాటు ఉంటుందని ప్లానెటరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ విభాగం అధ్యక్షుడు రఘునందన్ పేర్కొన్నారు.