SRD: నారాయణఖేడ్ మండలం మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కల్హేర్ మండలంలోని ఖానాపూర్ స్వగ్రామంలో ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకు లొంగరాదని సూచించారు. ఓటు సద్వినియోగం చేసుకోవడం భారత పౌరుడి హక్కు అని పేర్కొన్నారు.