E.G: సంక్రాంతి పండుగ సందర్భంగా పలు స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ – శ్రీకాకుళం రోడ్డు మధ్య 07288/ 07289 నంబర్ రైళ్లు జనవరి 9,10,11,12 తేదీలలో రాకపోకలు ఉంటాయని తెలిపింది. అలాగే 07290/07291 నంబర్ రైళ్లు సికింద్రాబాద్ -శ్రీకాకుళం రోడ్డు మధ్య నడవనున్నట్లు తెలిపింది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారలు తెలిపారు.