BHPL: భూపాలపల్లి మున్సిపాలిటీ 17వ వార్డు సుభాష్ కాలనీకి చెందిన గుర్రాల రామస్వామి అనారోగ్యానికి గురై సోమవారం ఉదయం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న DCC జిల్లా అధ్యక్షులు బట్టు కరుణాకర్ మృతుడి నివాసానికి వెళ్లి ఆయన పార్దివదేహానికి పూల మాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.