ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ (YSR) వర్ధంతిని పురస్కరించుకుని.. ఆయన మిత్రులు కేవీపీ రామచంద్రరావు, ఎన్. రఘువీరారెడ్డి రూపొందించిన ‘‘రైతే రాజైతే.. వ్యవసాయం (Agriculture) పండుగే’’అనే పుస్తకాన్నికాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ (Digvijay Singh) ఆవిష్కరించారు.‘వైఎస్సార్ ముక్కుసూటి మనిషి. వైఎస్సార్‌తో నా అనుబంధం విడదీయరానిది దిగ్గీ రాజా అన్నారు. వైఎస్సార్ మరణించకుండా ఉంటే తెలుగు రాష్ట్రాలు మరోలా ఉండేవి. శత్రువులు కూడా మెచ్చేగుణం వైఎస్సార్‌కు ఉంది. రాజశేఖర్ రెడ్డి దగ్గర నేను ఎంతో నేర్చుకున్నాను. వైఎస్సార్ బతికి ఉంటే బీజేపీ (BJP) తీసుకువచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ లో ధర్నా కు దిగేవాడు. వైఎస్సార్ లేకపోయి ఉంటే 2004,2009లో యూపీఏ (UPA) ప్రభుత్వం ఏర్పడకపోయేది. వైఎస్సార్ బతికి ఉంటే దేశంలో ఇప్పుడు ఉన్న విపత్కర పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడే వారు.’ అని తెలిపారు.
వైఎస్సార్ తో నేను రాజకీయంగా విభేదించొచ్చు. కానీ వైఎస్సార్ అమలు చేసిన ఆర్థిక, వ్యవసాయ విధానాలు అందరికీ ఆదర్శమని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి (Sudarshan Reddy) అన్నారు. నేను హైకోర్టు జస్టిస్ గా ఉన్న సమయంలో ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా..రాజ్యాంగ వ్యవస్థ ల ఒత్తిడి చేయలేదు. సుధీర్ఘ కాలం పోరాడి సీఎం అయిన వ్యక్తి కాబట్టి.. వైఎస్సార్ అందరి అభిప్రాయాలను గౌరవించేవారు. కాంగ్రెస్ అదిష్టానం పై ఒత్తిడి తీసుకొచ్చి మ్యానిఫెస్టో లో ఉచిత విద్యుత్ చేర్చారన్నారు. జాతీయ పార్టీ లకు ప్రాంతియ ప్రయోజనం అవసరం లేదా అనివైఎస్సార్ ప్రశ్నించారు.జాతీయ పార్టీ లో ఉన్నా ప్రాంతియ స్పృహ ఉన్న వ్యక్తి వైఎస్సార్’ అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి, టీ పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి, ఎపీ పీసీసీ ఛీఫ్ గిడుగు రుద్రరాజు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సీపీఐ నారాయణ, ఉండవల్లి అరుణ్ కుమార్, సీఏల్పీ నేత భట్టి విక్రమార్క, ఆనం రామనారాయణరెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రముఖ జర్నలిస్ట్ పీ సాయినాథ్, పలువురు నేతలు పాల్గొన్నారు.