MNCL: జన్నారం మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో నాలుగు ప్రీ ప్రైమరీ సెక్షన్లు మంజూరయ్యాయని స్థానిక ఎంఈఓ విజయ్ కుమార్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. పూర్వ శిశు విద్య కార్యక్రమంలో భాగంగా యుపిఎస్ రేండ్లగూడ, ఇందన్పల్లి, ఎంపీపీఎస్ కామన్పల్లి, బాదంపల్లి గ్రామాలలో ఉన్న పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ సెక్షన్లను ప్రారంభించనున్నామని తెలిపారు.