NGKL: కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ రోగులకు మెరుగైన సేవలు అందించేలా అదనపు సామగ్రి ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ..నియోజకవర్గంలో రోగుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున అందరికీ చికిత్స అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే స్పందించాలన్నారు.