Telangana Formation Day: తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
తెలంగాణ అవతరించి పది సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి మాజీ సీఎం, ప్రస్తుత సీఎం నివాళ్లు అర్పించారు. పరేడ్ గ్రౌండ్లో పదేళ్ల పండుగను అత్యంత వైభవంగా ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా రాష్ట్ర గీతాన్ని కూడా అవిష్కరించనున్నారు.
Telangana Formation Day: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడి నేటికి పది సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ వేడుకను అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ పదేళ్ల పండుగలో భాగంగా ముందుగా మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్చంతో నివాళ్లు అర్పించారు. ఆయన తరువాత మంత్రులు, ఎమ్మెల్యేలు స్థూపానికి పూలు సమర్పించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్లో రాష్ట్రప్రభుత్వ నిర్వహిస్తున్న వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అవిష్కరించనున్నారు.