SDPT: పోలీస్ కమిషనరేట్లో అడిషనల్ డీసీపీ శాంతిభద్రతలుగా విధులు నిర్వహిస్తున్న యస్.మల్లారెడ్డి పదోన్నతిపై రాచకొండ ట్రాఫిక్ డీసీపీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన మల్లారెడ్డికి పోలీస్ కమిషనర్ బి.అనురాధ శాలువాతో సన్మానించి, మెమెంటో అందజేసి వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.