JN: డిసెంబర్ 28 నుంచి 31వ తేదీ వరకు ఏపీజీవీబీ బ్యాంకు సేవలు నిలిపివేస్తున్నామని స్టేషన్ ఘనపూర్ ఏపీజీవీబీ బ్యాంక్ మేనేజర్ జి. నెహ్రు ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీజీవీబీ బ్యాంకును తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మార్చడం జరుగుతుందని, జనవరి 1 నుంచి సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు ఖాతాదారులు సహకరించాలని పేర్కొన్నారు.