MDK: పార్లమెంట్ సాక్షిగా డా. అంబేద్కర్ను అవమానించి ఎగతాళి చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ ఖేడ్ కన్వీనర్ అలిగే జీవన్ డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు అంబేద్కర్ పేరు జపం చేసి అధికారంలోకి వచ్చాక ఆయన పేరు ఎత్తకూడదని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. నేటి మనువాద మతోన్వాద ప్రభుత్వంలో రాజ్యాంగంపై దాడి జరుగుతుందన్నారు.