PDPL: ముత్తారం మండలం కేశనపల్లి గ్రామంలోని ఫర్టిలైజర్ షాపును మండల వ్యవసాయ అధికారి అనూష శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫర్టిలైజర్ దుకాణంలోని రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గోదాములలో నిలువలను పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులను అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు.