NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని మైసిగండి మైసమ్మ ఆలయ బ్రహ్మోత్సవాలు బుధవారం వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలి రోజు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. దీంతో మైసమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది.