ADB: సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రైతాంగానికి పూర్తిస్థాయిలో రుణమాఫీ జరగలేదన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారని తెలిపారు.