VKB: నవాబుపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. స్థానిక ఎర్ర సత్యం చౌరస్తా వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాడేమోని నర్సింహులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ పార్టీని స్థాపించారని తెలిపారు.