NZB: ఖరీఫ్ సీజన్లో వరి, మొక్కజొన్న, సోయా పంటల కోతలు ప్రారంభమైనందున ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు భూమయ్య ఆదివారం డిమాండ్ చేశారు. మొక్కజొన్నకు రూ. 2,400 మద్దతు ధర ఉండగా, కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను నష్టపరుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.