NTR: ఎన్టీఆర్ జిల్లాలో DSC-2025 ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు OCT 10 వరకు కొనసాగుతాయని ఎస్.ఎస్.ఏ ఎంవో శ్యాంసుందరరావు తెలిపారు. రెసిడెన్షియల్ విధానంలో ఈ శిక్షణను అందిస్తున్నారు. పామర్రులోని ప్రగతి విద్యాలయంలో 953, తిరువూరులోని వాహిని ఇంజినీరింగ్ కళాశాలలో 249 మందికి శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు.