మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో దసరా ఉత్సవాలు, రావణ కాష్టం, బతుకమ్మ వేడుకల సందర్భంగా నిర్వహించే ఏర్పాట్లను నగర మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ నేడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు సుఖ సంతోషాలతో దసరా వేడుకలు జరుపుకోవాలని అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.