కామారెడ్డి: జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న అధికారుల భవనాలు, సిబ్బంది విశ్రాంతి గదులను, పిల్లల గదులను, జిమ్ గది నిర్మాణాలను రాష్ట్ర పి అండ్ ఎల్ఐజి ఏం. రమేష్ పరిశీలించారు. ఎస్పీ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా ఆయనకు జిల్లా ఎస్పీ సింధు శర్మ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, ఏఆర్డి డీఎస్పీ యాకూబ్ పాల్గొన్నారు.