హోంబలే ఫిల్మ్స్ వారు భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘బఘీర’ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ పారమ్ నెట్ఫ్లిక్స్లో కన్నడ, తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో స్టీమింగ్ అవుతోంది. కన్నడలో భారీ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం తెలుగులో అంత ప్రభావం చూపలేకపోయింది. క, లక్కీ భాస్కర్, అమరన్ వంటి సినిమాలు బరిలో ఉండటం వల్ల పెద్దగా ఆడలేకపోయింది. కాగా, రిలీజ్ అయిన 20 రోజుల్లోనే ఓటీటీలోకి రావడం విశేషం.