AP: ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు, YSR జిల్లాలకు చెందిన వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్‌గా ఉన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా కో-ఆర్డినేట్‌గా బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డికి అదనంగా ఉమ్మడి కృష్ణా జిల్లా కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలను అప్పగించారు.